CTR: పుంగనూరు పట్టణం తూర్పు మోగసాలలో వెలిసిన శ్రీచాముండేశ్వరి దేవి ఆలయం శుక్రవారం మహిళలు భక్తిశ్రద్ధలతో రాహుకాల పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారి మూల విగ్రహానికి ఫల పంచామృతాలతో పాటు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకించారు. తర్వాత అమ్మవారికి హారతులను ఇచ్చి రాహుకాల పూజలు నిర్వహిచారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.