BHPL: మొగుళ్లపల్లి (M) గుండ్లకర్తిలో సర్పంచ్ సంజీవరావు బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే వాటర్ ప్లాంట్ సమస్యను పరిష్కరించారు. ఎన్నాళ్లుగా తాగునీటి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల గోసను గుర్తించి అధికారులతో సమన్వయం చేశారు. సర్పంచ్ చొరవతో ప్లాంట్ మళ్లీ పనిచేయడంతో శుద్ధమైన తాగునీరు గ్రామానికి అందుబాటులోకి వచ్చింది. గ్రామ ప్రజలు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.