AP: మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామును సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. నేటి నుంచి మూడు రోజులు జోగి సోదరులను ప్రశ్నించనున్నారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో విజయవాడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ చేయనున్నారు.