MNCL: విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంచాలని లక్షెట్టిపేట ఎంఈవో శైలజ అన్నారు. శుక్రవారం లక్షెట్టిపేట పట్టణంలోని బోయవాడ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలతో విద్యార్థులకు ఉత్తమ విద్యను బోధించాలన్నారు. అనంతరం పలు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కూడా సందర్శించారు.