కాకినాడ జిల్లాలో గత ఏడాదిలో మొత్తం 191 స్క్రబ్ టైపస్ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్వో తెలిపారు. గత నెలలో మొత్తం 43 పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.