తూ.గో జిల్లాలో ఖరీఫ్ వరి సేకరణ విజయవంతంగా కొనసాగుతోందని జేసీ వై. మేఘా స్వరూప్ తెలిపారు. జనవరి 1, 2026 నాటికి పీపీసీల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరించగా, 47,426 మంది రైతులు ధాన్యం విక్రయించారు. ఈ సీజన్లో మొత్తం 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు . రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జేసీ తెలిపారు.