W.G: తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. తణుకు మండలం వేల్పూరుకి చెందిన అందే లోకేశ్వరరావు, అందే వెంకటలక్ష్మి (48) దంపతులు ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి దర్శనం ముగించుకుని బైకుపై వస్తుండగా.. తేతలి జాతీయ రహదారిపై లారీ ఢీకొట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.