VZM: గ్రామీణ ప్రాంతాల్లో పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల సమర్థ నిర్వహణ లక్ష్యంగా “స్వచ్ఛ రథం” పథకాన్ని జనవరి 17న జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. గ్రామాల్లో ఉత్పత్తి అయ్యే పొడి చెత్తను సేకరించి, వస్తు మార్పిడి విధానంలో నిత్యావసర సరుకులు అందించనున్నట్లు పేర్కొన్నారు.