వరంగల్ సెంట్రల్ జోన్ DCP దార కవిత జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని , ప్రతిఒక్కరూ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గడిచిన ఏడాదిలో ఏమైనా తప్పులు చేస్తే వాటిని అధిగమించటానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.