NZB: రెంజల్ ZPHS పాఠశాలను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా బేస్లైన్, మిడ్లైన్ అసెస్మెంట్లలో LIP (లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్) అమలు తీరును పరిశీలించారు. విద్యార్థుల విద్యా ప్రగతి, పనితీరు వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అలాగే బోధన విధానాలు మరింత మెరుగుపడేందుకు అవసరమైన సూచనలు చేశారు.