WGL:పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ షాపును ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రిబ్బన్ కట్ చేసి గురువారం ప్రారంభించారు. షాప్ యజమానిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వ్యాపారాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.