GDWL: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, పురపాలక పరిపాలన శాఖ ఆదేశాల మేరకు అయిజ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల వారిగా ఓటరు ముసాయిదా జాబితా సిద్ధం చేసినట్లు కమిషనర్ సైదులు తెలిపారు. ఈ జాబితాను మున్సిపల్, తహశీల్దార్, మండల పరిషత్, ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. మార్పులు, చేర్పులు ఉంటే మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.