KKD: గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు గురిచేసిన, అక్రమ కేసులు బనాయించిన తట్టుకుని కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టడంలో టీడీపీ శ్రేణులు కీలకపాత్ర పోషించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ కార్యకర్తలకు ఆయన ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు.