BPT: ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా చందోలు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో విద్యార్థులకు చందోలు పోలీస్ స్టేషన్ ఎస్సై మర్రి వెంకట శివకుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత డ్రగ్స్, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.