BPT: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బుధవారం ఇంకొల్లులో పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన గురుకులం షెడ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.