NLG: ఎస్టీయూ టీఎస్ జిల్లా కౌన్సిల్ సమావేశం నల్గొండలోని ఎస్టీయూ భవన్లో బుధవారం జరిగింది. పెండింగ్ డీఏలను నూతన పీఆర్సీలను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని సమావేశంలో డిమాండ్ చేశారు. జిల్లా నూతన అధ్యక్షులుగా తండు భాను ప్రకాష్, కార్యదర్శిగా మురారి శెట్టి రమేష్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా కరుణాకర్ రెడ్డి వ్యవహరించారు.