PLD: అంబడిపూడిలో జరిగిన ‘100 రోజులు–100 గ్రామాలు’ పర్యటనలో బుధవారం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఆయన, కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.