AP: చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాలనికి అరుదైన గుర్తింపు లభించింది. ఆలయం చేస్తున్న నాణ్యమైన పాలన, పారిశుద్ధ్యం, అన్నదాన వితరణ సక్రమంగా నిర్వహిస్తున్నందుకు గాను తాజాగా ISO సర్టిఫికెట్ మంజూరైంది. ఈ మేరకు స్థానిక MLA కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో దేవస్థానం ఛైర్మన్, ఈవోలకు సర్టిఫికెట్లు అందజేశారు.