NLG: నిబంధనలకు విరుద్ధంగా మర్రిగూడెం మండలంలోని చర్లగూడెం గ్రామ పరిధిలో మట్టి అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను తహశీల్దార్ శ్రీనివాసులు బుధవారం సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణాకు ఎవరు పాల్పడిన ఉపేక్షించేది లేదని తెలిపారు. ఒక టిప్పర్, జేసీబీని స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.