సత్యసాయి: మడకశిర నియోజకవర్గంలోని ఉత్తమ బూత్ ఇంఛార్జ్‌లకు ఎమ్మెల్యే MS రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి బుధవారం ప్రశంసా పత్రాలు అందజేశారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వారిని MLA అభినందించారు. రాబోయే రోజుల్లోనూ కార్యకర్తలు ఇదే ఉత్సాహంతో పని చేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బూత్ ఇంఛార్జ్‌ల పాత్ర కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.