BDK: జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ జితేష్ వి. పాటిల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న నూతన సంవత్సరంలో ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, శాంతి, సమృద్ధి తీసుకురావాలని, జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా సాగాలని ఆకాంక్షించారు. తనను కలిసేందుకు బొకేలతో కాకుండా పెన్ను, పెన్సిల్, పుస్తకాలు తీసుకురావాలని కోరారు.