సత్యసాయి: పరిగి మండలం కోనాపురం, మోద గ్రామాల్లో CSR నిధులతో పూర్తి చేసిన ఎన్టీఆర్ శుద్ధజల కేంద్రాలను మంత్రి సవిత బుధవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఎస్టేట్ బుల్ ప్రతినిధులు సునీల్ శర్మ ముందుకు రావడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. అనంతరం ఆయనను మంత్రి ఘనంగా సన్మానించారు.