KMR: జిల్లా కేంద్రంలోని బాలసదన్ పిల్లలకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అక్కడికి వెళ్లి చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకల్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారులతో కలసి సహపంక్తి భోజనం చేసి, వారి సంక్షేమానికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.