ATP: అత్యధిక లోక్ అదాలత్ కేసులను పరిష్కరించినందుకు తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డిని జిల్లా SP జగదీష్ ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లాలోని ఇతర స్టేషన్ల కంటే మెరుగైన పనితీరు కనబరిచినందుకు ఆయనకు ప్రశంసా పత్రం అందజేశారు. కోర్టు కానిస్టేబుల్ లక్ష్మిరెడ్డి సేవలను కూడా ఎస్పీ అభినందించారు. విధి నిర్వహణలో నిబద్ధత చాటిన పోలీసు సిబ్బందిని కొనియాడారు.