‘రాజాసాబ్’ ఈవెంట్లో సీనియర్ హీరోలపై ప్రభాస్ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించాడు. ప్రభాస్ చేసిన కామెంట్స్ నిజంగా గ్రేట్ అని, ఇండస్ట్రీలో ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సిన గౌరవాన్ని ఆయన చాటి చెప్పాడని కొనియాడాడు. తోటి హీరోలు, అందులోనూ తనకంటే సీనియర్ల పట్ల ప్రభాస్ చూపించే గౌరవం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత ఎత్తులో నిలబెట్టిందని అన్నాడు.