కృష్ణా: చల్లపల్లిలో శివాజీ అనే హోంగార్డ్ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తూ, ఆటో ఎక్కాడు, తాను దిగాల్సిన ప్రాంతం రావడంతో హడావుడిగా ఆటో దిగి పర్సు ఆటోలోనే మర్చిపోయాడు. పర్సుని గమనించిన ఆటో డ్రైవర్ సంతోష్ ఆ పర్సుని సీఐ నున్న రాజుకి బుధవారం అందజేశాడు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ను సీఐ నున్న రాజు అభినందించి సత్కరించారు.