ATP: నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన తాను అందుబాటులో ఉండటం లేదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. ఈ మేరకు తాడిపత్రి వైసీపీ కార్యాలయం సిబ్బంది ఒక ప్రకటన విడుదల చేశారు. శుభాకాంక్షలు తెలపడానికి దూర ప్రాంతాల నుంచి ఎవరూ రావొద్దని కోరారు. ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.