SRD: ఉపాధి, ఆర్థిక పునరావసం కింద ట్రాన్స్జెండర్లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి బుధవారం తెలిపారు. బీపీఎల్ పరిధిలో ఉండి 18 నుంచి 55 సంవత్సరాలలోపు ఉన్నవారు అర్హులని చెప్పారు. అర్హులైన వారు దరఖాస్తులను జనవరి 9 లోపు కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.