TG: నీళ్ల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. నీళ్ల గురించి ఎవరికి తెలయదన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. నీళ్ల సెంటిమెంట్‌ను రేకెత్తించి అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. కృష్ణా జలాల్లో వాటా కోసం అప్పుడు ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు.