TG: మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. పోలవరం – నల్లమలసాగర్ ప్రి ఫీజిబులిటీ రిపోర్ట్ CWC ఆమోదించలేదని తెలిపారు. ఈ మేరకు డిసెంబర్ 4న CWC తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. హరీష్ రావు ఏదో లేఖ చూపించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము రాష్ట్ర నీటి హక్కులను కాపాడుతున్నామని చెప్పారు.