జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సినిమా ‘డ్రాగన్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని షూట్ కోసం లొకేషన్లను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ జోర్దాన్.. అమన్ ప్రాంతం విజువల్స్‌ని నెట్టింట షేర్ చేశారు. దీంతో ఈ లొకేషన్స్‌లో డ్రాగన్ షూటింగ్ ఉండనున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.