KNR: లోయర్ మానేరు జలాశయం నుంచి దిగువ ఆయకట్టుకు యాసంగి పంటకు కాకతీయ కాలువ ద్వారా నీటిని బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు కరీంనగర్ ఇరిగేషన్ సర్కిల్- 2 ఎస్ఈ రమేష్ తెలిపారు. వారబంధీ పద్ధతిలో 284 కి.మీల వరకు 7 రోజులు ఆన్, ఆ తరువాత 340 కి.మీల వరకు 8 రోజులు ఆన్ పద్ధతిన సాగునీటి విడుదల ఉంటుందని, రైతులు సాగునీటిని వృథా కాకుండా వాడుకోవాలన్నారు.