అనకాపల్లికి ట్రామా కేర్ సెంటర్ మంజూరైనట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. మంగళవారం విశాఖలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రూ. 22 కోట్లతో అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో దీనిని నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే అచ్యుతాపురం మండలానికి ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరైనట్లు చెప్పారు. మార్చి లేదా ఏప్రిల్ నెలలో శంకుస్థాపన జరుగుతుందన్నారు.