BHNG: ఆలేరు నియోజకవర్గంలో 8 మండలాల్లో గెలుపొందిన సర్పంచులకు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రీటింగ్స్తో పాటు స్వీట్ బాక్స్ అభినందిస్తూ లెటర్ అందజేస్తున్నట్టు మంగళవారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. నూతన సంవత్సరంలో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని కోరారు.