WGL: మంత్రి కొండ సురేఖ ఆదేశాల మేరకు బుధవారం BC సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు TPCC చేనేత విభాగం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. మెటీరియల్ టెండర్ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్టులు ఇవ్వడం వల్ల సుమారు 60,000 చేనేత కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో పాత పద్ధతినే కొనసాగించాలని మంత్రిని కోరారు.