నిర్మాత బండ్ల గణేష్ మళ్లీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టాడు. నిర్మాతగా సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన ‘బీజీ బ్లాక్ బస్టర్స్’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఈ బ్యానర్‌కు సంబంధించిన అధికారిక లోగోను కూడా విడుదల చేశాడు. ఇకపై ఈ సంస్థ నుంచి భారీ స్థాయి సినిమాలు వస్తాయని ప్రకటించాడు.