AP: విజయవాడ దుర్గగుడిలో పవర్ కట్కు సమన్వయ లోపమే కారణమని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని వివరించారు. భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తామని మంత్రి పేర్కొన్నారు.