కృష్ణా: గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. 2024 జూన్ 7న సునీల్‌పై జరిగిన దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 17న మాచవరం పోలీసులు వంశీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి వంశీ కనిపించకపోవడంతో, అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.