NGKL: జిల్లాలో ఎలాంటి యూరియా కొరత లేదని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. ఉదయం 6 గంటలకే యూరియా విక్రయాలు ప్రారంభమవుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా యూరియా పంపిణీ చేయడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.