ATP: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సమష్టిగా అభివృద్ధి చెందాలని శ్రీవారిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు.