VZM: ప్రముఖ భారతీయ తత్వ దర్శన కేంద్రం శ్రీ క్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనంకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయం అర్చకులు వేదమంత్రాల నడుమ శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు చేశారు. ధర్మకర్తలు దుర్గా బాలాజీ, ఉమాదేవి దంపతులు, నీరజ పాల్గొన్నారు.