అధ్యక్షుడు పుతిన్ నివాసంపై డ్రోన్ దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించినట్లు నిన్న రష్యా విదేశాంగ మంత్రి ప్రకటించారు. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ ఉక్రెయిన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి గురించి పుతిన్ తనతో మాట్లాడినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ చేసే ఇలాంటి చర్యలను సహించబోనని మండిపడ్డారు. కాగా, ఈ దాడి తాము చేయలేదని ఉక్రెయిన్ చెప్పుకుంటోంది.