విశాఖ: మల్కాపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఎంఇఎస్ క్వార్టర్స్‌లో పని చేస్తున్న దుర్గా నగర్‌కు చెందిన రాడ్ బెండర్ కంబాల చంటి సోమవారం సాయంత్రం నాల్గవ అంతస్తు నుంచి జారిపడి మృతి చెందాడు. తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు రక్షించలేకపోయారు. మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.