W.G: నూతన సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాల వేళలను మార్చాలని ఐద్వా సంఘం ఆధ్వర్యంలో ఆకివీడు ఎక్సైజ్ సీఐ ఎం. శ్రీనివాసరావుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. డిసెంబర్ 30 నుంచి జనవరి ఒకటో తేదీ మద్యం అమ్మకాలను రాత్రి 7 గంటలకు ముగించాలని ఐద్వా డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఆదాయం కోసం మద్యాన్ని ప్రోత్సహించవద్దని ఈ సందర్బంగా వారు పేర్కొన్నారు.