TG: హైదరాబాద్‌లో డిజిటల్ అరెస్ట్ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను గుజరాత్‌కు చెందిన షోయబ్ జాహిద్ భాయ్, బెలిమ్ అనస్ రహీమ్లుగా గుర్తించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళను బెదిరించి డబ్బు వసూలు చేశారు. ప్రభుత్వ, టెలికాం అధికారులుగా నటించి మహిళకు ఫోన్ చేశారు. ఆమె భర్తపై కేసులున్నాయని.. మహిళ వద్ద రూ.1.95 కోట్లు వసూలు చేశారు.