ATP: HLC కాలువ తుంపెర డీప్ కట్ నుంచి దౌర్జన్యంగా నీటిని తరలించడాన్ని నిరసిస్తూ పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి మండలాల రైతులు మంగళవారం తుంపెర వద్దకు చేరుకోవాలని రైతు ఐక్యవేదికకు పిలుపునిచ్చింది. అధికారుల అనుమతి లేకుండా కాలువను తెంపి నీటిని తీసుకెళ్లడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా JC ప్రభాకర్ రెడ్డి హాజవుతారని నేతలు తెలిపారు.