SKLM: ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులను తక్షణమే చేపట్టి మార్చి 31 లోపు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఇవాళ స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు.