కృష్ణా: గుడ్లవల్లేరు మండలం మార్కెట్ యార్డ్ సమీపంలో ఇవాళ పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా కోడి కత్తులు పట్టుబడ్డాయి. కంభం రామకృష్ణ అనే వ్యక్తి వద్ద కత్తులు ఉన్నాయన్న సమాచారంతో ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 240 కోడి కత్తులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.