NZB: నవీపేట్ మండలం రాంపూర్ గ్రామ అంగన్వాడీ సెంటర్లో సోమవారం కుక్కర్ పేలిన ఘటనలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని రెంజల్ 108 సిబ్బంది లక్ష్మణ్, నయీమ్ ప్రథమచికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పిల్లల కోసం కుక్కర్లో పప్పు ఉడికిస్తున్న సమయంలో అది పేలి సమీపంలోని ఉన్న చిన్నారులకు గాయాలయ్యాయి.