ADB: ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్ గ్రామంలో జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద జయంతి సందర్బంగా మెగా రక్తదాన శిభిరం నిర్వహిస్తున్నట్లు సోమవారం గ్రామస్థులు తెలిపారు. అత్యవసరాల్లో ఉన్న ఇతరుల ప్రాణాన్ని కాపాడేందుకు తమ రక్తాన్ని దానం చేయాలన్నారు. స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో జరిగే శిభిరాన్ని యువత అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.